AP News: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం..
ABN, Publish Date - Oct 22 , 2025 | 01:13 PM
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.
- నలుగురు బెంగళూరువాసులకు గాయాలు
కర్నూలు: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డు(Srisailam-Dornala Ghat Road)లో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నూజివీడు డిపో(Nuzvid Depot)కు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తుండగా, బెంగళూరు(Bangalore)కు చెందిన కారు దోర్నాల నుంచి శ్రీశైలం వైపు వెళ్తండగా చిన్నారుట్ల మూలమలుపు వద్ద ఎదురుపడి ఢీకొన్నాయి.
దీంతో కారు మందుభాగం దెబ్బ తినింది. అందులో ఉన్న రవికుమార్, భాస్కర్, ప్రభావతి, తేజస్విని(Ravikumar, Bhaskar, Prabhavathi, Tejaswini) గాయపడ్డారు. 108లో క్షతగాత్రులను సమీపంలోని సున్నిపెంట వైద్యశాలకు తరలించారు. దోర్నాల పోలీసుస్టేషనుకు ఫిర్యాదు అందడంతో ఎస్సై మహేష్ సిబ్బందితో వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 22 , 2025 | 01:13 PM