ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దారుణం.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చంపేశాడు.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - May 13 , 2025 | 07:09 AM

తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న చిన్న కారణంతో... ఆ మహిళ భర్తను దారుణంగా హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పనరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- తనను కాదని మరొకరితో పెళ్లి

- మహిళ భర్తను చంపిన యువకుడు

- గంజాయి మత్తులో ఘాతుకం

హైదరాబాద్: తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఆ మహిళ భర్తను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా అడివిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి జగదీష్‌(Medisetty Jagadish) కుటుంబం కేపీహెచ్‌బీ కాలనీ సర్దార్‌ పటేల్‌నగర్‌లోని కేఎస్ఆర్‌ అయ్యప్ప ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా ఉంటోంది. జగదీష్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది.

ఈ వార్తను కూడా చదవండి: మావోల వేటకు విరామం.. బార్డర్‌‌కు బలగాలు


దుర్గాప్రసాద్‌ మరదలు శ్రావణ సంధ్యను పెళ్లి చేసుకుంటానని, అదే గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి అలియాస్‌ పవన్‌కుమార్‌ (27) ఎనిమిదేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు. వారు తిరస్కరించి ఆమెకు వెంకటరమణ(30)తో వివాహం జరిపించారు. అప్పటి నుంచీ శ్రావణ సంధ్య, వెంకటరమణలపై పవన్‌కుమార్‌ కక్ష పెంచుకున్నాడు. వారం క్రితం శ్రావణ సంధ్య స్వగ్రామంలోని ఓ వివాహానికి వెళ్లింది.


అప్పటి నుంచీ వెంకటరమణ భోజనానికి జగదీష్‌ ఇంటికి వస్తున్నాడు. నగరంలోనే ఉంటున్న పవన్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి నలుగురు స్నేహితులతో వచ్చి జగదీష్‌ ఉండే అపార్ట్‌మెంట్‌ గేటు ముందు సిగరెట్లు, గంజాయి తాగుతూ అల్లరి చేశాడు. వారిని జగదీష్‌, వెంకటరమణ ప్రశ్నించగా వారిపై ఐదుగురు యువకులు దాడి చేశారు. వెంకటరమణను కత్తితో పొడిచి పారి పోయారు. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగదీష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 07:09 AM