ఇండోనేషియాకు చెందిన సహబత్ అలామ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కోడె నాగును అందంగా మార్చేశాడు. దాని తలకు చేత్తో అల్లిన టోపీ తగిలించటంతో అది చిన్న పాపలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయింది.పాము అని వినపడగానే.. నూటికి 99 శాతం మంది గుండెలు జల్లుమంటాయి. భయంతో చెమటలు కూడా పడతాయి. పామును లైవులో.. దగ్గరగా చూస్తే ఆ పరిస్థితి గురించి వర్ణించటం కష్టమే. నవనాడులు నాట్యం ఆడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కోడె నాగుతో ఆటలు ఆడాడు. దానికి టోపీ పెట్టి అందంగా ముస్తాబు చేశాడు. పాములంటే భయపడేవారు కూడా దాన్ని చూసి ‘ చో క్యూట్’ అనకమారరు. అంతలా అందంగా మారిపోయింది.