Share News

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ABN , Publish Date - May 13 , 2025 | 06:35 AM

Gold Rate Today: నిన్న హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96880 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88800 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72660 దగ్గర ట్రేడ్ అయింది.

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today

ముందెన్నడూ ఊహించని విధంగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధం ముందు వరకు బంగారం ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోయింది. అయితే, యుద్ధం రావటంతో మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడింది. బంగారం ధరలు తగ్గాయి. లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా పడిపోయింది. 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. యుద్ధం ముగిసి, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా బంగారం ధరలు దిగజారుతూ ఉన్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


13వ తేదీనాటి బంగారం ధరలు ఇలా..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. నిన్న హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96880 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88800 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72660 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 96870 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88790 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72650 దగ్గర ట్రేడ్ అవుతోంది.


నేటి వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం పెరగటం.. తగ్గటంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర 10900 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,09000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10890 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,08900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

Nirmal: బుద్ధుడి విగ్రహం ఏర్పాటుపై వివాదం

Updated Date - May 13 , 2025 | 06:39 AM