Share News

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

ABN , Publish Date - May 13 , 2025 | 06:04 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌లోని మారేడుబాకలో సోమవారం మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు.

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

  • ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఘటన

చర్ల, మే 12 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌లోని మారేడుబాకలో సోమవారం మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఆ గ్రామానికి చెందిన బండారి నాగ(45)ని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది నాగ తమ్ముడు బండారి తిరుపతిని కూడా మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేశారు.


ఇదిలా ఉండగా ఈ నెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను 9వ తేదీన బీజాపూర్‌ వైద్యశాలకు తరలించారు. ఇప్పటి వరకు 9 మందిని గుర్తించి వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 06:04 AM