ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇదో కొత్తరకం మోసం.. చానల్‌ చూస్తే రోజుకు రూ.10 వేలు

ABN, Publish Date - May 15 , 2025 | 07:09 AM

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం ఎంచుకున్నారు. వాట్సప్‌ చానల్‌ను వీక్షిస్తే చాలు.. మీకు డబ్బులు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇది తెలియని పలువురు ఈ మోసాని డలవుతూ.. ఆర్ధికంగా నష్టపోతున్నారు. అసలీ వాట్సప్‌ చానల్‌ ఏంటో.. దాని వల్ల వచ్చే నష్టం ఏంటో ఓసారి పరిశీలిస్తే..

- పార్ట్‌టైం జాబ్‌ పేరుతో బురిడీ

- విద్యార్థిని నుంచి రూ.లక్ష కొట్టేసిన మోసగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: పార్ట్‌టైం జాబ్‌లో భాగంగా వాట్సప్‌ చానల్‌ను వీక్షిస్తే డబ్బులు ఇస్తామని నగరానికి చెందిన విద్యార్థినిని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రూ.లక్ష కాజేశారు. సికింద్రాబాద్‌(Secunderabad)కు చెందిన విద్యార్థిని (24)కి పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. ‘ఇంట్లోనే కూర్చుని మా వాట్సప్‌ చానల్‌ను చూస్తూ రేటింగ్‌ ఇచ్చిన స్ర్కీన్‌షాట్‌ పెడితే చాలు డబ్బు సంపాదించవచ్చు’ అని దాని సారాంశం. ఆ గ్రూప్‌లో చేరినందుకు జాయినింగ్‌ బోనస్‌ అంటూ రూ.208 ఖాతాలో జమ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Maoist Party: శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి


తాము చెప్పిన విధంగా పెట్టుబడి పెట్టి పనిచేస్తే రోజుకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదించవచ్చని నమ్మించారు. తర్వాత ఓ వెబ్‌లింక్‌ పంపారు. వారి మాటలు నమ్మిన విద్యార్థిని పలు దఫాలుగా రూ.లక్ష వారు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది. యాప్‌లో రూ.1.99 లక్షలు వచ్చినట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా, రూ.1.99 లక్షలు డిపాజిట్‌ చేస్తే మొత్తం కలిపి చేతికి వస్తాయని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. దాంతో మోసపోయానని గ్రహించిన విద్యార్థిని సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 07:09 AM