Share News

Maoist Party: శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి

ABN , Publish Date - May 15 , 2025 | 05:03 AM

ఆపరేషన్‌ కగార్‌ పేరిట దారుణమారణకాండ కొనసాగుతోందని, దీనికి అడ్డుకట్ట వేస్తూ శాంతిచర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఓ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ కోరారు.

Maoist Party: శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి

  • ఆయుధాలు వీడటంపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేం

  • మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌

హైదరాబాద్‌, మే14 (ఆంధ్రజ్యోతి) ఆపరేషన్‌ కగార్‌ పేరిట దారుణమారణకాండ కొనసాగుతోందని, దీనికి అడ్డుకట్ట వేస్తూ శాంతిచర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఓ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ కోరారు. శాంతిచర్చలకు అనుకూల వాతావరణంలో భాగంగా తాము షరతుల్లేని కాల్పుల విరమణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటన జారీ చేశామని గుర్తు చేశారు. శాంతిచర్చల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ బహిరంగసభలో శాంతిచర్చలు కావాలన్న డిమాండ్‌కు లక్షలాది ప్రజలు ఇచ్చిన స్పందన కేంద్రం గమనించాలని కోరారు.


తమ పార్టీ నిర్మాణం ప్రజాస్యామ్య పద్ధతిలో ఉంటుందని ఆయుధాల వీడటంపై తానొడినే నిర్ణయం తీసుకోలేనని, కేంద్రకమిటీ, కోర్‌ కమిటీ సమావేశమై చర్చ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వాస్తవ పరిస్థితులు అందుకు అనుగణంగా లేవని కేంద్ర, కోర్‌ కమిటీసభ్యులు కలవడానికి వీలుగా కాల్పుల విర మణ, శాంతిచర్చల ప్రక్రియ కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 05:03 AM