Nadendla Manohar: ఒంటరి, లింగమార్పిడి వాళ్లకు రేషన్‌కార్డు
ABN, Publish Date - May 12 , 2025 | 04:03 AM
ఒంటరి, లింగమార్పిడి అయినవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు
15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు
పౌరసరఫరాల మంత్రి మనోహర్ వెల్లడి
తెనాలి, మే 11(ఆంధ్రజ్యోతి): వివాహం కాకుండా 50ఏళ్లు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లకు, ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులతో పాటు దేశంలోనే తొలిసారిగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,21,223 రేషన్‌కార్డులు ఉండగా.. కొత్త నిర్ణయాల ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఒంటరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డు మంజూరు అవుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌కార్డు మంజూరు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆశ్రమాల్లో ఉంటూ నిరాశ్రయులుగా ఉన్న వారికి స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా వారికి కూడా కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కళాకారులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని, అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారిని ఆదుకునేలా ఇకపై అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం అందించనున్నట్లు మంత్రి వివరించారు. దుర్భల గిరిజన సమూహాలు (పీవీటీజీ) జాబితాలో ఉన్నవారికి కూడా ఏఏవై కింద బియ్యం ఇస్తామన్నారు. దీనిద్వారా ఏలూరు, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లోని కొండప్రాంతాల్లో నివసించే 12 కులాల గిరిజనులు, చెంచులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఏ కార్యాలయానికి వెళ్లకుండానే..
ఏ కార్యాలయానికి వెళ్లకుండానే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేలా ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 6 రకాల సేవలను వినియోగించుకోవచ్చన్నారు. 9552300009 నంబరుకు వాట్సా్‌పలో ‘హలో’ అని ఇంగ్లిష్‌లో మెస్సేజ్ పెడితే రేషన్ కార్డు సేవలు అందుతాయన్నారు. ఈకేవైసీలో ఏపీ దేశంలోనే 95ు పూర్తిచేసి అగ్రస్థానంలో ఉందన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి అవకాశం కల్పించామని, లోపాలు సరిచూసుకుని కొత్త కార్డు పొందాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ డేటాలో కనిపించని 79,173మంది కార్డుదారుల వివరాలను పరిశీలిస్తున్నామని, వాటిని త్వరలో సరి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News
Updated Date - May 12 , 2025 | 04:03 AM