Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
ABN , Publish Date - May 11 , 2025 | 05:47 PM
Operation Sindoor: భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ కొన్ని గంటలకే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఈ రెండు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల వేళ ఆ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ, మే 11: భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌లు పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపుతోపాటు ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ఈ చర్చలలో ప్రస్తావనకు రానున్నాయి.
శనివారం అంటే మే 10వ తేదీ సాయంత్రం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత సైన్యం సమాధానం కారణంగా పాకిస్తాన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. చివరకు అమెరికాను రాయబారం కోసం వేడుకోగా, ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ రోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత DGMOకి ఫోన్ చేశారు.
ఈ రోజు సాయంత్రం5.00 గంటల నుంచి నుంచి భూమి,వాయు,సముద్రంపై కాల్పులతోపాటు సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపి వేయాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని ఈ రోజు రెండు పార్టీలకు ఆదేశాలు అందాయన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ చర్చించనున్నట్లు వెల్లడించారు.
అయితే ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే పాక్ మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘించినట్లు అయింది. ఈ అంశం సైతం సోమవారం చర్చల్లో కీలక అంశంగా మారే అవకాశముందని తెలుస్తోంది. ఈ హాట్ లైన్ చర్చల కోసం ఇరు దేశాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For National News And Telugu News