ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Weather Update: రేపు దక్షిణ అండమాన్‌కు నైరుతి

ABN, Publish Date - May 12 , 2025 | 03:42 AM

రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రాన్ని తాకనున్నాయి. రాష్ట్రంలో వడగాడ్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి తీవ్రత కొనసాగుతోంది

  • రాష్ట్రంలో కొనసాగిన ఎండ మంటలు

  • 144 చోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం

విశాఖపట్నం/అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్‌ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయవ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం 144 ప్రాం తాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2, తిరుపతి జిల్లా ఓజిలి, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 41.8, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.


మోస్తరు వర్షాలు-వడగాడ్పులు

సోమవారం 42-43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 29 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లోని మరో 41 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని తెలిపింది. అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలో ఎండతీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. సోమ, మంగళవారాల్లో కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వివరించారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 03:42 AM