ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Kesineni Chinni: చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం

ABN, Publish Date - May 01 , 2025 | 01:43 PM

MP Kesineni Chinni: ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫించన్లు పంపిణీ చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో పేదల సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

MP Kesineni Chinni

విజ‌య‌వాడ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్య‌ధికంగా ఫించ‌న్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. ఇవాళ(గురువారం) విజయవాడలోని రాణిగారితోట‌లో 17వ, 18వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఫించ‌న్ సొమ్ము అంద‌జేశారు. ఈ సందర్భంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే విడ‌త‌ల వారీగా కాకుండా ఒకేసారి ఫించ‌న్ పెంచి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ నిల‌బెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం సాకారం‌ అవుతుందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్లడించారు.


కూటమి ప్రభుత్వంలో ప్రతి హామీని నెరవేరుస్తాం: ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు జిల్లా: కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. భర్తను కొల్పోయిన మహిళలకు ఇప్పటికే వితంతు పింఛన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజధాని పున:నిర్మాణ కార్యక్రమానికి తరలి రావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 01:48 PM