ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనల వెల్లువ

ABN, Publish Date - May 07 , 2025 | 08:34 AM

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని పలువురు ప్రముఖులు మద్దతు పలికారు.

Operation Sindhur

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారతదేశం మెరుపు దాడులు చేసింది. 'ఆపరేషన్ సిందూర్‌' (operation sindoor) పేరుతో దాడులు చేసింది. పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. 9 పాక్ ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తొయిబా ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేశాయి. కోట్లీ, బహ్వాల్‌పూర్‌, మురిడ్కే, ముజఫరాబాద్‌లో దాడులు చేసింది. చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్‌పై దాడులు చేసింది.


'ఆపరేషన్ సిందూర్‌'కు సీఎం చంద్రబాబు మద్దతు...

'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఆపరేషన్ సిందూర్‌'కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జైహింద్ అంటూ ఎక్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జైహింద్‌.. జైహింద్‌కీ సేనా అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.


కేంద్రమంత్రులు ఏమన్నారంటే...

'భారత్ మాతాకీ జై' అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. భారత్‌ మాతాకీ జై అంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ స్పందించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోస్ట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్‌ఫర్ టెర్రరిజం భారత్ మాతాకీ జై అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు.


ఆపరేషన్ సిందూర్‌ చరిత్రాత్మకం: రఘురామ కృష్ణరాజు

ఆపరేషన్ సింధూర్ చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రఘురామ కృష్ణరాజు అభినందనలు తెలిపారు.


ఉగ్రవాదంపై భారత్ పోరాడాలి: సీపీఐ నారాయణ

ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్, పాకిస్తాన్ ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. టెర్రిరిజం వల్ల పాక్తిసాన్ కూడా అంతర్గతంగా నష్టపోతోందని చెప్పారు. టెర్రరిజంపై పోరాడాల్సిన బాధ్యత ఇండియాకు ఉందని తెలిపారు. అయితే పాకిస్తాన్‌తో యుద్దం కంటే ఉగ్రవాదంపై యుద్దం ముఖ్యమని అన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్దం వల్ల ఉగ్రవాదులు మరింత బలపడతారని నారాయణ చెప్పారు.


పాక్ ఉగ్రవాదులకు భారత్ సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది: మంత్రి అనగాని

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు భారత్ సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైందని అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా ఏరివేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలు నిజమయ్యాయని చెప్పారు. ‘మేరా భారత్ మహాన్... జైహింద్’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి

India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..

భారత్ ఆపరేషన్‌ సిందూర్‌..

India Revenge On Pahalgam: పహల్గామ్‌కు భారత్ ప్రతీకారం.. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి..

For National News And Telugu News

Updated Date - May 07 , 2025 | 01:25 PM