Nara Lokesh: భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా క్వాంటమ్ వ్యాలీ
ABN, Publish Date - Jul 08 , 2025 | 02:34 PM
క్వాంటమ్ వ్యాలీ భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్గాటించారు. అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
అమరావతి: అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. ఇవాళ(మంగళవారం) జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీల్లో శరవేగంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.
ఏపీలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీ రాజధాని అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీ భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఉద్గాటించారు మంత్రి నారా లోకేష్.
మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా తయారవుతోందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ఏపీలో రాయితీలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం
Read latest AP News And Telugu News
Updated Date - Jul 08 , 2025 | 03:07 PM