Share News

TTD: శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:47 AM

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ‘పుస్తక ప్రసాదం’ అందించే ఆలోచనలో టీటీడీ ఉంది. టీటీడీ ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌(హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో భక్తులకు...

TTD: శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం

  • దాతల సహకారంతో కొత్త పథకం రూపకల్పనలో టీటీడీ

తిరుమల, జూలై 7(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ‘పుస్తక ప్రసాదం’ అందించే ఆలోచనలో టీటీడీ ఉంది. టీటీడీ ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌(హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేసేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకోవాలని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సంబంధిత అఽధికారులను ఆదేశించారు. ‘కర్తవ్యం దైవమాహ్నికమ్‌, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీనివాసుని దివ్యకథ, భజగోవిందం, లలితా సహస్రనామ స్తోత్రం, రథ సప్తమి, కళ్యాణ తేజో దీపిక’ వంటి వివిధ రకాల పుస్తకాలు భక్తులకు అందించనున్నారు. తొలుత తిరుమలకు వచ్చే భక్తులకు మాత్రమే పుస్తక ప్రసాదం అందిస్తారు. దశల వారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తారు. హిందూ భక్తి భావ జాల వ్యాప్తికీ, మతమార్పుడులను అడ్డుకోవడానికి కూడా పుస్తక ప్రసాదం ఉపకరిస్తుందని టీటీడీ భావిస్తోంది.

Updated Date - Jul 08 , 2025 | 06:49 AM