ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farmers: రైతుల కోసం వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాం

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:47 AM

Telangana: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతులతో నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ప్రాజెక్టు‌ను వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు.

హైదరాబాద్, మార్చి 6: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతుతో (Telangana Farmers) నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ప్రాజెక్టు‌ను వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటికే 5000 ఎకరాలతో ఒక క్లస్టర్‌గా విభజించి 2601 రైతు వేదికలను ఏర్పాటు చేశారు. ఈ రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా రైతులకు పలు అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు. మొదటగా నియోజకవర్గంలో ఒకటి చొప్పున 110 రైతు వేదికలకు వీడియో కాన్ఫెన్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అధిక రాబడి, మార్కెటింగ్, మెరుగైన వ్యవసాయంపై వీడియో కాన్ఫరెన్స్‌లతో రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారంలో నిపుణులచే రైతులకు డిజిటల్ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణలు ఇవ్వనున్నారు.

Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ భేటీ


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwarrao) ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2024 ఖరీఫ్ నుంచి రైతుల పండించిన పంట బీమాపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ వాటా ప్రీమియం సబ్సిడీతో పాటు రైతుల వాటా సబ్సిడీ కూడా ప్రభుత్వం భరించనుంది. గతంలో పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించటానికి సందర్భాన్ని బట్టి రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుండేది. ప్రస్తుతం రియల్ టైంలో పంట దిగుబడులను సాంకేతికంగా నిర్ధారించి సత్వరమే పరిహారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.

ఇవి కూడా చదవండి...

TS News: 3న పెళ్లి రిసెప్షన్.. తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మృతి

Bhuvaneswari: అనంత, కర్నూలులో ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 11:32 AM

Advertising
Advertising