తెలంగాణలో ఏరులై పారిన మద్యం.. 3 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు
ABN, Publish Date - Jan 02 , 2026 | 12:37 PM
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు
హైదరాబాద్, జనవరి 2: కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు అధికారులు తెలిపారు. డ మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు రూ. వెయ్యి కోట్లపైనే మద్యం విక్రయాలు జరిగాయి. ఈ లెక్కలు చూస్తే.. ఎంత ఖర్చైన పర్లేదు.. తాగి ఎంజాయ్ చేయాలనే ధోరణిలో మందు బాబులు ఉన్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశం గురించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి...
అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ
కేసీఆర్, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్
Updated Date - Jan 02 , 2026 | 12:37 PM