ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌తో పాక్‌కు ముక్కుతాడు

ABN, Publish Date - Dec 25 , 2025 | 02:15 PM

ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్‌లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌

ఎంత శాంతియుతంగా ఉన్నా.. పొరుగునే ఉన్న పాకిస్థాన్ మాత్రం భారత్‌పై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ జమ్మూ కశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం బైసన్ లోయలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనే ఉదాహరణ. ఏప్రిల్ 22వ తేదీ. బైసన్ లోయలో పచ్చిక మైదానాల ఆందాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. అంతలో తుపాకులతో అక్కడికి చేరుకున్నారు ముష్కరులు. మీరు హిందువులా అంటూ పర్యాటకులను ప్రశ్నించడం.. వారు సమాధానం చెప్పేలోగానే వారి శరీరంలో తుపాకీ గుళ్లు చీల్చుకుపోయాయి. అలా ఒకరు ఇద్దరు కాదు.. మొత్తం 26 మంది విగత జీవులుగా మారారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ముష్కరులు మాత్రం అక్కడికి ఎలా వచ్చారో.. అక్కడి నుంచి అలాగే వెళ్లిపోయారు. మృతుల్లో ఒకరు స్థానికుడు కాగా.. మిగిలిన 25 మంది పర్యాటకులే. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ అంతా పాకిస్థాన్ అనేందుకు పూర్తి సాక్ష్యాధారాలను భారత్ సంపాదించింది. దాంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లే సింధూ జలాలను నిలిపివేసింది. భారత్ భూభాగ పరిధిలో ఆకాశంలో పాక్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది. భారత్‌లోని పాక్ రాయబారిని పిలిచి.. స్వదేశం వెళ్లిపోవాలంటూ స్పష్టం చేసింది. ఇలా పాకిస్థాన్‌పై భారత్ పలు కఠినమైన ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ సైతం ఇదే రీతిలో స్పందించింది. కొన్న దశాబ్దాల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిని సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాకిస్థాన్ భూభాగ పరిధిలోని ఆకాశంలో భారత్ విమానాలు ప్రవేశించకుండా కట్టడి చేసింది. పాకిస్థాన్‌లోని భారత్ రాయబారిని పిలిపించి.. స్వదేశం వెళ్లిపోవాలంటూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది.

ఇక 2025, మే 7వ తేదీన భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ నెేలమట్టమయ్యాయి. ఆ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలోనే లష్కరే ఈ తోయిబా వ్యవస్థాపకుడు అజార్ కుటుంబ సభ్యుల్లో పలువురు మృతి చెందారు.

మరోవైపు ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్‌లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చివరకు మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాంతో భారత్, పాకిస్థాన్‌లు ప్రస్తుతం సంయమనం పాటిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి

For More National News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 02:26 PM