Share News

Powerful Bomb Blast in Mosque: మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి

ABN , Publish Date - Dec 25 , 2025 | 08:59 AM

నైజీరియాలోని మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Powerful Bomb Blast in Mosque: మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి
Bomb Blast in Mosque

నైజీరియా, డిసెంబర్ 25: నైజీరియా ఈశాన్య నగరం మైదుగురిలోని మసీదులో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ప్రార్థన చేస్తున్న ఏడుగురు ముస్లింలు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రత్యేక సాక్షులు వెల్లడించారు. అయితే ఇది ఆత్మాహుతి దాడి అని మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే స్థానిక గాంబోరు మార్కెట్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ పేలుడు చోటు చేసుకుంది.


ఈ బాంబు పేలుడుకు తాము బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదని జిహాదీ మిలటరీ నాయకుడు బాబాకురో కోలో వెల్లడించారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురి నగరం జిహాదీల సంస్థ బోకో హరామ్‌తోపాటు దాని అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్.. తిరుగుబాటుదారులకు నిలయంగా ఉన్న సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.


2009 నుంచి నైజీరియాలో జిహాదీ తిరుగుబాటు సాగుతోంది. నాటి ఈ ఘర్షణల్లో దాదాపు 4 వేల మందికిపైగా మరణించారు. ఇక దశాబ్దం నాటి నుంచి హింస తీవ్రత తగ్గింది. ఈ హింస తీవ్రత చాడ్, కామెరూన్ ప్రాంతాలకు వ్యాపించింది. మళ్లీ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో హింస తిరిగి పుంజుకోవడంతో ఆందోళనలు రేగుతున్నాయి. ఈ ప్రాంతంలో 2021లో భారీ దాడి జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడని స్థానికులు వివరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ ప్రధాని వాజ్‌పేయ్ జన్మదిన వేడుకలు.. హాజరుకానున్న ప్రముఖలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

For More International News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 10:37 AM