గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Oct 02 , 2025 | 06:52 PM
గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని చంద్రబాబు తెలిపారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు.
విజయవాడ: నగరంలోని యస్.యస్. కన్వెన్షన్‌లో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇవాళ(గురువారం) గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ మనకు సత్యం, అహింస గురించి నేర్పించారని చంద్రబాబు తెలిపారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Updated Date - Oct 02 , 2025 | 06:57 PM