ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Train: సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 14న గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:59 AM

భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌: భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. ఈ రైలులో వెళ్లే యాత్రికులు వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాలను సందర్శించవచ్చని వివరించారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలదేరే ఈ రైలు భువనగిరి, జనగాం(Bhuvanagiri, Jangaon), కాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు(Khammam, Madurai, Vijayawada, Eluru), రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దా రోడ్‌, జూత్‌కరాజ్‌, భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ రోడ్‌, బాలాసోర్‌ స్టేషన్‌లలో వచ్చి వెళ్లేప్పుడు ఆగుతుందని పేర్కొన్నారు.

ఈనెల 22వ తేదీ రాత్రి 10.30 గంటలకు రైలు తిరిగి సికింద్రాబాద్‌(Secunderabad) చేరుకుంటుందన్నారు. గంగా-రామాయణ పుణ్యక్షేత్ర దర్శన ప్యాకేజీల్లో ఎకానమీ పెద్దలకు రూ.16,200, పిల్లలకు (5నుంచి 11 ఏళ్ల లోపు) రూ.15,200, స్టాండర్డ్‌ (3 ఎసీ) పెద్దలకు రూ.26,500, పిల్లలకు రూ.25,300, 2ఎసీ పెద్దలకు రూ.35,000, పిల్లలకు రూ.33,600గా ఖరారు చేశామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

కేటీఆర్‌ కేంద్రంగా అమెరికాలోనూ హడావుడి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 07:06 AM