Mahesh Kumar Goud: అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:45 AM
రాష్ట్రంలో కోవర్టులున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు.
క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
పదేళ్లలో బీసీలకు ఏం చేశారు?
జవాబు చెప్పాకే కవిత రైల్ రోకో చేయాలని సూచన
హైదరాబాద్, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోవర్టులున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఈ అంశాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రతి పార్టీలోనూ కోవర్టులు ఉంటే ఉండొచ్చునని, కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపాలి కదా? అని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు జూలైలో అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నామని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారని తెలిపారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మహేశ్ కుమార్‌గౌడ్ మాట్లాడారు. బీసీల గురించి ఖర్గేకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం విచిత్రంగా ఉందన్నారు.
ఆమె ఆ లేఖను బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రాశారా? జాగృతి తరఫున రాశారా? అన్నది స్పష్టత లేదన్నారు. కవిత రైల్ రోకో, షిప్ రోకో, విమానం రోకో చేస్తారో కవిత ఇష్టం అని.. పదేళ్లపాటు అధికారంలోకి ఉండి బీసీలకు ఏం చేశారో అనేది ఆమె చెప్పి.. ఆ తర్వాతే రోకో చేయాలని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను తగ్గించింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసమే కవిత, బీసీల జపం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు లిక్కర్ కేసులో కవిత జైలులో ఉన్నారని చెప్పారు. బీసీ నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక్క బీసీ నేత కూడా దొరకలేదా? అని ప్రశ్నించారు. బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు హరీశ్ రావు సిద్ధమా? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్ గత
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 04:45 AM