Share News

Rayachoti Terrorists Arrest: రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:39 PM

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్ట్ చేశామని చెప్పారు.

Rayachoti Terrorists Arrest: రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
IPS Vidya Sagar naidu

కడప, జులై 03: రాయచోటిలో అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదుల నెట్‌వర్క్‌పై లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. గురువారం రాయచోటిలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. అబూబకర్ సిద్దిక్ అలియాస్ సిద్దిక్ ఐదేళ్ల క్రితం రాయచోటిలోనే వివాహం చేసుకున్నాడని తెలిపారు.

ఇక మరో ఉగ్రవాది మన్సూర్ 10 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నాడని వివరించారు. అయితే వీరిద్దరి భార్యలను అనుమానాస్పద రీతిలో అరెస్టు చేశామని తెలిపారు. అదీకాక.. ఈ ఇద్దరు ఉగ్రవాదులు టెక్నీకల్ ఎక్స్‌పర్ట్స్ అని చెప్పారు. ఆ క్రమంలోనే వీరి నివాసాల్లో మందు గుండు సామగ్రి దొరికిందన్నారు. స్థానికంగా దొరికే వస్తువులతోనే వీరు బాంబులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.


వీరు రాయచోటిలో స్థిరపడిన అనంతరం 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో బాంబు పేలుళ్ల ఘటనలో ఈ ఉగ్రవాదుల హస్తం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఈ ఉగ్రవాదుల వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలకు చెందిన మ్యాప్ ఉందని చెప్పారు. ఇక రైల్వే నెట్ వర్క్ సైతం ఈ ఉగ్రవాదుల వద్ద లభ్యమైందన్నారు. దక్షిణ భారతదేశంలో ఆలూమా అనే ఉగ్రవాద సంస్థలో వీరిద్దరు కీలక వ్యక్తులుగా ఉన్నారన్నారు. వీరిద్దరిపై లోతుగా విచారణ జరుపుతామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 07:03 PM