ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Government: తెలంగాణలో డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు చేయూత పెన్షన్లు

ABN, Publish Date - Jun 21 , 2025 | 05:08 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు చేయూత పెన్ష‌న్లు ఇవ్వడానికి సిద్ధమైంది. మే నెలలో 4021 మంది డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు పెన్ష‌న్లను ప్ర‌జా ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

Pensions to Dialysis Patients

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు (Dialysis Patients) చేయూత పెన్ష‌న్లు ఇవ్వడానికి సిద్ధమైంది. మే నెలలో 4021 మంది డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు పింఛన్లను ప్ర‌జా ప్ర‌భుత్వం మంజూరు చేసింది. డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు నెల‌కు ప్ర‌భుత్వం రూ.2016 మంజూరు చేసింది. బీఆర్ఎస్ హ‌యాంలో కేవ‌లం 4011 మందికి మాత్ర‌మే డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు ఆస‌రా పింఛన్లు వచ్చేవి. ఒక్క మే నెలలోనే అంత‌కు మంచి పెన్ష‌న్లను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

మంత్రి సీత‌క్క చొర‌వ‌తో నూత‌న ల‌బ్ధిదారులని ప్రభుత్వం ఎంపిక‌ చేస్తోంది. మొద‌ట‌గా డయాల‌సిస్ రోగులకు పింఛన్లు మంజూరు చేయడానికి ఒకే చెప్పింది. త్వ‌ర‌లో హెచ్ఐవీ రోగులకు కూడా పెన్ష‌న్లు ఇవ్వడానికి ఆమోదించింది. త‌మ‌కు పెన్ష‌న్లు మంజూరు చేయాల‌ని ఇప్పటికే 13 వేల మంది హెచ్ఐవీ భాదితులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. త్వ‌ర‌లో అన్నిర‌కాల నూత‌న పెన్ష‌న్‌దారుల‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఆర్థిక శాఖ అనుమ‌తులను పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కోరింది. అనుమ‌తులు రాగానే నూత‌న పెన్ష‌న్లు ఇవ్వనుంది. పింఛన్ల కోసం నెల‌కు రూ.993 కోట్లను తెలంగాణ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి

భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 10:07 PM