ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Government: ఆ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jul 09 , 2025 | 02:25 PM

కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియామకం చేసిన ఈ ఉద్యోగాలపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana Government

హైదరాబాద్: కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియామకం చేసిన కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సమీక్షించాలని ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పీఎస్‌యూలు ,స్థానిక సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాలపై సమీక్షకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఈ కమిటీలో రిటైర్డ్ సీఎస్ ఏ.శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు ఉన్నారు. మంజూరు చేయబడిన పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త ఆంక్షలు, సవరణలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. శాఖా కార్యదర్శులు, విభాగాల అధిపతులతో సంప్రదించి సమగ్ర అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదికను ఈ కమిటీ ఇవ్వనుంది.

ఈ వార్తలు కూడా చదవండి

లెవల్‌ క్రాసింగ్‌ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి

ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 09 , 2025 | 03:24 PM