ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరు

ABN, Publish Date - Jul 30 , 2025 | 08:47 AM

బెట్టింగ్ యాప్స్ కేస్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్‌రాజ్‌కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ప్రకాష్‌రాజ్‌ బుధవారం విచారణకు హాజరు కానున్నారు.

Prakash Raj

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేస్‌లో (Betting Apps Case) ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీసెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్‌రాజ్‌కి (Prakash Raj) ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ఇవాళ(బుధవారం జులై 30) ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేస్‌లో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేస్ నమోదు చేశారు. జంగిల్ రమ్మీ యాడ్‌లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్‌. ఈ యాడ్‌ని ప్రమోట్ చేయడంతోనే ప్రకాష్‌రాజ్‌ పేరుని నోటీసులో చేర్చారు ఈడీ అధికారులు.

36 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన సినీసెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు పది రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతోనే ఎంతోమంది వీటికి అలవాటు పడి భారీగా నష్టపోయారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే పలువురు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో బెట్టింగ్ యాప్స్‌‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా బెట్టింగ్ యాప్స్‌‌పై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

కర్రు కాల్చి వాత పెట్టాలి.. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 08:58 AM