ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Drug Racket: హైదరాబాద్ పబ్‌లలో భారీగా డ్రగ్స్ దందా.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN, Publish Date - Jul 09 , 2025 | 01:54 PM

భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు.

Drug Racket

హైదరాబాద్: భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు (Eagle team officials) ఇవాళ(బుధవారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్‌ (Drug Racket) గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాకి ఈగల్ టీం అధికారులు వివరాలు వెల్లడించారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలో డ్రగ్ సరఫరా జరుగుతున్నట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు. ప్రముఖ ఆస్పత్రిలోని కార్డియాలజీ డాక్టర్ ప్రసన్నకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. భీమవరానికి చెందిన డాక్టర్ ప్రసన్న ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈగల్ టీం అధికారులు.

సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేశాడు. ప్రముఖ పబ్‌లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు కనుక్కున్నారు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. క్వాక్ రాజాశేఖర, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య పేర్కొన్నారు. ములుగులోని రిసార్ట్‌లోకి ఫ్రెండ్స్‌ని పిలిచి పార్టీలు ఇచ్చినట్లు సూర్య తెలిపారు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లేడీస్ హై హీల్స్ చెప్పుల లోపల డ్రగ్స్ పెట్టి మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యకు నైజీరియన్స్ పార్సిల్ చేశారు. ఢిల్లీకి చెందిన నిక్కి, జెర్రీ నైజీరియన్‌లు కలిసి సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య అతని మిత్రుడు హర్షలను అరెస్టు చేసి ఈగల్ టీం అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

లెవల్‌ క్రాసింగ్‌ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి

ఎన్డీఏలోనే బీసీ వ్యతిరేకత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 09 , 2025 | 02:06 PM