ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Huge Drugs in Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN, Publish Date - May 12 , 2025 | 03:38 PM

Huge Drugs in Hyderabad: హైదరాబాద్‌లో సోమవారం నాడు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Huge Drugs in Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ అడ్డాగా మరోసారి భారీ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నిందితులు వేర్వేరు దారుల్లో తరలిస్తునే ఉన్నారు. తాజాగా ఉప్పల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ(సోమవారం) మీడియాకు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు. ఉప్పల్‌లో 106 కిలోల గంజాయి సీజ్ చేసుకున్నామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఉప్పల్ హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఒక గోదాంలో నిందితులు గంజాయి నిల్వ చేశారని చెప్పారు.


పక్కా సమాచారంతో గంజాయి సీజ్ చేశామని.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. 106 కేజీల గంజాయిని 56 ప్యాకెట్‌లలో నిందితులు ప్యాక్ చేశారని అన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.53 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు కేజీల గంజాయిని నింపారని చెప్పారు. ఈ కేసులో కట్ల వివేక్ రెడ్డి, మధు కిరణ్‌లను అరెస్టు చేశామని అన్నారు. వివేక్‌రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి చెప్పారు.


ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన రాంబాబును ప్రధాన నిందితుడిగా గుర్తించామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. రాంబాబు పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. రాంబాబు మల్కాన్‌గిరి నుంచి నిందితులకు గంజాయి పంపుతారని తెలిపారు. కట్ల వివేక్‌రెడ్డి, మధు కిరణ్ ఈ గంజాయిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చేర వేస్తారని చెప్పుకొచ్చారు. తాను పంపిన గంజాయి స్టాక్‌ను క్లియర్ చేసినందుకుగాను రాంబాబు ఇద్దరు నిందితులకు రూ.50 వేలు ఇస్తాడని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.


రాంబాబును ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. ఆయనను విచారించిన తర్వాత కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. వివేక్‌పై ఆల్రెడీ రెండు కేసులు ఉన్నాయని.. రాంబాబుపై భద్రాచలంలో రెండు కేసులు ఉన్నాయని వివరించారు. మల్కాన్‌గిరి అటవి ప్రాంతంలో గంజాయిని ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారని తెలిపారు. మల్కాన్‌‌గిరి నుంచి హైదరాబాద్‌కు వివిధ మార్గాల్లో గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 03:55 PM