Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
ABN , Publish Date - May 12 , 2025 | 06:40 AM
Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి (13 Dead) చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయ్‌పూర్ (Raiipur) - బలోద బజార్ (Balod Bazar) దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ వాహనాన్ని అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో 30 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ వెల్లడించారు.
ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: అది బ్రహ్మాస్త్రమే..
మరోవైపు తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం, అగరాల పంచాయతీ, నారాయణ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువన్నామలై నుండి తిరుపతికి వస్తున్న తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొంది. ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా ఒత్తిడికి ఇందిర తలొగ్గని వేళ..
For More AP News and Telugu News