Jammu Kashmir: వెంటనే ఇళ్లకు తిరిగి రాకండి
ABN , Publish Date - May 12 , 2025 | 05:05 AM
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, జమ్మూకశ్మీర్ యంత్రాంగం సరిహద్దు గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఫిరంగి గుండ్లను గుర్తించి, తొలగించేవరకు తిరిగి ఇళ్లకు వెళ్ళవద్దని అధికారులు స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలకు అధికారుల సూచన
శ్రీనగర్, మే 11: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు తొందరపడి వెంటనే తిరిగి ఇళ్లకు రావద్దని జమ్మూకశ్మీర్ యంత్రాంగం సూచించింది. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలనుంచి సుమారు 1.25 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. పాకిస్థాన్ బలగాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్లను గుర్తించి తొలగించేదాకా రావొద్దని వీరికి అధికారులు స్పష్టం చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు ఆయా గ్రామాల్లో ఫిరంగి గుండ్లను గుర్తించి తొలగిస్తాయని, అనుమతిచ్చాకే గ్రామాలకు తిరిగి రావాలని సూచించారు. 2023లో ఎల్‌ఓసీ వెంబడి ఫిరంగి గుండ్ల పేలుళ్ల కారణంగా 41 మంది మృతిచెందిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్