Share News

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం.. భారత సైన్యం..

ABN , Publish Date - May 11 , 2025 | 07:26 PM

పాకిస్థాన్ మొదటిరోజు డ్రోన్ దాడులపై విరుచుకపడటంతో దాదాపు అన్నింటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని కూల్చేసిందని, భారత్ జరిపిన కౌంటర్ అటాక్‌లో లాహోర్‌లోని రాడార్ ఇన్‌స్టలేషన్‌ ధ్వంసమైందని లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ తెలిపారు. పాక్ భూతల దాడులను అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు.

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం.. భారత సైన్యం..

న్యూఢిల్లీ: ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టినట్టు భారత సైన్యం ప్రకటించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి మే 7న దాడులు జరిపామని, 100 మందికి ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపింది. పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు ఆదివారం నాడు మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, ఎయిర్ మార్షల్ అవదేష్ కుమార్ భార్తి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ సందీప్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్


పాకిస్థాన్ మొదటిరోజు డ్రోన్ దాడులపై విరుచుకపడటంతో దాదాపు అన్నింటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని కూల్చేసిందని, భారత్ జరిపిన కౌంటర్ అటాక్‌లో లాహోర్‌లోని రాడార్ ఇన్‌స్టలేషన్‌ ధ్వంసమైందని లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ తెలిపారు. పాక్ భూతల దాడులను అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 35 నుంచి 40 మంది పాక్ జవాన్ల హతమైనట్టు చెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులతో పాక్ వణికిపోయిందన్నారు. అయితే పౌరులే లక్ష్యంగా మనపై పాక్ దాడులు జరిపి తగిన మూల్యం చెల్లించుకుందని చెప్పారు.


ఐఏఎఫ్ ఇన్‌స్టలేషన్లను పాక్ టార్గెట్‌గా చేసుకుని దాడులు జరిపినట్టు మార్షల్ అవదేశ్ కుమార్ చెప్పారు. అయితే వాటిని మధ్యలోనే అడ్డుకోవడంతో భూతలంపై ఎలాంటి నష్టం జరగలేదన్నారు. వెస్ట్రన్ ఫ్రంట్ వెంబడి ఎయిర్ బేస్‌లు, కమాడ్ సెంటర్లపై దాడులను పూర్తి సమన్వయంతో తిప్పికొట్టామని, ఎలాంటి దాడులనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చామని మార్షల్ భార్తి చెప్పారు.


ఇవి కూడా చదవండి:

బయటపడిన పాక్ పాపాలు

కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 07:46 PM