Pakistan On Pulwama Attack: బయటపడిన పాక్ పాపాలు.. సిగ్గులేకుండా ఒప్పుకున్నారు..
ABN , Publish Date - May 11 , 2025 | 12:52 PM
Pakistan: పాకిస్థాన్ తన పాపాలను ఎట్టకేలకు బయటపెట్టింది. ప్రపంచ మీడియా ముందు బహిరంగంగా తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంది. అయితే పాక్ పొగరు మాత్రం తగ్గడం లేదు. అసలేం జరిగిందంటే..

ఫిబ్రవరి 14, 2019.. భారత చరిత్రలో ఇదో చీకటిరోజు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. ఈ అటాక్‌లో ఏకంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు అమరులు అయ్యారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల మన సైనికుల ప్రాణాలు పోయాయి. అయినా పాక్ ఎప్పుడూ తన తప్పును ఒప్పుకోలేదు. ఈ దాడితో తమకు సంబంధం లేదంటూ కవర్ చేసుకుంటూ వచ్చింది. అయితే చేసిన పాపాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు అదే జరిగింది. పుల్వామా అటాక్ తామే చేశామని పాకిస్థాన్ అసలు నిజాన్ని బయటపెట్టింది. అసలు ఏం జరిగిందంటే..
అందరి ముందే..
పహల్గాం అటాక్‌కు రివేంజ్‌గా ఆపరేషన్ సిందూర్‌తో గత కొన్ని రోజులుగా పాక్‌ను వణికిస్తోంది భారత్. మన సైన్యం దెబ్బ తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చిన శత్రుదేశం.. సీజ్‌ఫైర్‌కు ఇండియాను ఒప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ త్రివిధ దళాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పలు ప్రపంచ దేశాలకు చెందిన రిపోర్టర్లు సంధించిన ప్రశ్నలకు పాక్ అధికారులు జవాబులు ఇచ్చారు. ఈ క్రమంలోనే పుల్వామా అటాక్‌లో తమ హస్తం ఉందని అందరి ముందే ఆ దేశ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ బయటపెట్టారు.
సహించబోం
పాకిస్థాన్ జలాలు, భూభాగం, గగనతలానికి ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే తాము సహించబోమని పాక్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ స్పష్టం చేశారు. అలాంటి చర్యల్ని చూస్తూ ఉపేక్షించబోమన్నారు. దేశ ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు అహ్మద్. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పుల్వామాతో తాము ఆల్రెడీ ప్రూవ్ చేశామన్నారు. కాగా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఔరంగజేబ్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీతో పాటు ఓ నేవీ అధికార ప్రతినిధి కూడా పాల్గొన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని.. వాళ్లను వదలొద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి