Share News

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా..

ABN , Publish Date - May 11 , 2025 | 12:43 PM

Operation Sindoor: ఆ వీడియోలు, ఫొటోలు ఫేక్ అని తేలిపోయింది. వారు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని రుజువైంది. తాజాగా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌలా తరార్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియోతో పాక్ పరువు మరోసారి పోయింది.

Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా..
Operation Sindoor

యుద్ధంలో భారత్, పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. మిస్సైల్స్, డ్రోన్లతో పాక్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. అయితే, ఈ దాడులకు సంబంధించి భారత్ అతి తక్కువ వీడియోలను మాత్రమే విడుదల చేసింది. కానీ, పాక్‌కు చెందిన అధికార ప్రతినిధులు, సెలెబ్రిటీలు, ఆఖరికి మంత్రులు కూడా పదుల సంఖ్యలో వీడియోలు, ఫొటోలు విడుదల చేశారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియోలు, ఫొటోలను పోస్టు చేశారు. భారత్‌ దుమ్ము దులిపేశామంటూ ప్రచారం చేసుకున్నారు.


అయితే.. ఆ వీడియోలు, ఫొటోలు ఫేక్ అని తేలిపోయింది. వారు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం అని రుజువైంది. తాజాగా, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌలా తరార్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ఇండియాకు సరైన విధంగా సమాధానం చెప్పాం అంటూ రాసుకొచ్చాడు. అయితే, ఆ వీడియో ఫేక్ వీడియో అని తేలింది. ఈ మేరకు యూకే డిఫెన్స్ జర్నల్ ఆ పోస్టుపై ట్విటర్ ద్వారా స్పందించింది. ‘ పాకిస్తాన్ గవర్నమెంట్‌‌కు చెందిన అఫిషియల్ ట్విటర్ ఖాతాలో ‘ ఆర్మా 3 ’ వీడియో గేమ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.


భారత్‌కు తమ మిలటరీ సమాధానం ఇచ్చిందని రాసుకొచ్చారు’ అని పేర్కొంది. యూకే డిఫెన్స్ జర్నల్ పెట్టిన పోస్టుతో పాకిస్తాన్ పరువు మరో సారిపోయింది. గత కొద్దిరోజులనుంచి పాక్ సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నాయి. వీటిని పీఐబీ తిప్పికొడుతూనే ఉంది. వాటిపై ఫ్యాక్ట్ చెక్ చేసి, నిజానిజాలను భారత ప్రజలకు అందిస్తోంది. భారత ప్రజల్ని భయాందోళనకు గురిచేయాలన్న ఉద్ధేశ్యంతోటే పాక్ తప్పుడు ప్రచారాలకు తెరతీసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

ChatGPT Claims: చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ

Operation Sindoor: దీపావళి రాకెట్ కాదురా బాబు.. అది మిస్సైల్..

Updated Date - May 11 , 2025 | 12:46 PM