Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
ABN , Publish Date - May 11 , 2025 | 07:27 PM
ఆపరేష్ సిందూర్ సందర్భంగా యూట్యూబర్ అల్లాహ్‌బాదియా పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. దీంతో, అతడు దాన్ని తొలగించి మరో వీడియో పోస్టు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్థానీలను ఉద్దేశిస్తూ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియా పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. దీంతో, మరోసారి చిక్కుల్లో పడ్డ అతడు ఆ వెంటనే దాన్ని తొలించాడు. అయితే, ఆ పోస్టు తాలూకు స్క్రీన్ షాట్స్‌ను నెట్టింట పంచుకున్న జనాలు విమర్శలను కొనసాగిస్తున్నారు.
తాను సామాన్య పాకిస్థానీలను ద్వేషించనని అతడు పోస్టు పెట్టాడు. ఇతర భారతీయులు తమపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు పాకిస్థానీలు భావిస్తే తాము క్షణమాపణలు చెబుతున్నట్టు వ్యాఖ్యానించాడు. భారతీయుల ఆగ్రహం పాక్ మిలిటరీ, ఐఎస్ఐపైనేనని స్పష్టం చేశాడు. అయితే, జనాలు మాత్రం రణ్‌వీర్‌ను తిట్టిపోస్తున్నారు. ఇంత జరిగినా ఇంకా బుద్ధి మార్చుకోవట్లేదంటూ విమర్శలు గుప్పించారు.
‘‘పాక్ సోదర సోదరీమణులారా.. ఇలాంటి పోస్టు పెడుతున్నందుకు భారతీయుల్లో కొందరు నాపై విమర్శలు ఎక్కుపెట్టొచ్చు. కానీ ఇది కచ్చితంగా చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. నా హృదయంలో మీపై ఎటువంటి ద్వేషం లేదు. మనందరం శాంతిస్థాపననే కోరుకుంటున్నాం. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా మీరు సాదరస్వాగతం పలుకుతారు’’
‘‘కానీ మీ దేశాన్ని పాలిస్తున్నది ప్రజాప్రభుత్వం కాదు. సైన్యం, నిఘా సంస్థ మీ దేశాన్ని నడిపిస్తున్నాయి. ఓ సాధారణ పాకిస్థానీ ఈ రెండు వ్యవస్థల కంటే ఎంతో భిన్నం. అతడి హృదయం శాంతిస్థాపన కోసం పరితపిస్తుంటుంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ ఈ రెండు విలన్లు మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. భారత్‌పై ఇప్పటివరకూ జరిగిన ఉగ్రదాడులన్నిటికీ వారే కారణం’’
‘‘ఇప్పటివరకూ పట్టుబడ్డ టెర్రరిస్టులందరూ పాకిస్థానీలే, టెర్రరిస్టుల అంత్యక్రియల్లో మీ సైనిక పాలకులు పాల్గొంటారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు మీ నాయకుడే ఓ టీవీ కార్యక్రమంలో బహిరంగంగా అంగీకరించాడు. కానీ మీ బాగోగులను నేను కోరుకుంటాను. మిమ్మల్ని కలిసిన భారతీయులకు మీరేంటో తెలుసు. భారత్, పాక్ మీడియా రెండూ ప్రస్తుతం వాస్తవాలను వ్యాపిస్తున్నాయి. రెండు దేశాల్లోనూ అధికశాతం మంది శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారు. కానీ పాక్ మిలిటరీ, ఐఎస్ఐ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం అంతాన్ని కూడా భారత్ కోరుకుంటోంది’’ అని అన్నాడు.
అయితే, జనాలు మాత్రం ఈ పోస్టుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇది భారత సాయుధ దళాల త్యాగాలను అవమానించడమే అని అన్నారు. ఇలాంటి వాళ్లు అస్సలు మారరని మరికొందరు కామెంట్ చేశారు. అయితే, మరో వీడియో షేర్ చేసిన అల్లాహ్‌బాదియా.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయొద్దని అన్నాడు. తాజా ఉగ్రదాడిలో పాక్ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి