ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం..

ABN, Publish Date - Jun 30 , 2025 | 08:09 PM

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Hyderabad Rain

Hyderabad Rain:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట్, గోల్కొండ, టోలీచౌకి, రాజేంద్రనగర్, బండ్లగూడ, నార్సింగి, మణికొండ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శివమ్ రోడ్, ఖైరతాబాద్, చందానగర్, BHEL, గచ్చిబౌలి, మియాపూర్, మెహిదీపట్నం, వెంకటగిరి, యూసుఫ్‌గూడ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు నిర్మల్, ఆదిలాబాద్, నారాయణపేట్ జిల్లాల్లోనూ వాన దంచికొడుతోంది.

నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశమంతటా విస్తరించాయి. అరేబియా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలోని 19 జిల్లాలు, ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని ఓ నివేదికలో పేర్కొంది. సముద్ర తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 08:59 PM