Share News

MLA Raja singh: రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్

ABN , Publish Date - Jun 30 , 2025 | 07:13 PM

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్ అయింది. అతడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వెంటనే అగ్రనేతలు రంగంలోకి దిగారు.

MLA Raja singh: రాజాసింగ్‌పై అగ్ర నాయకత్వం సీరియస్
MLA Raja Singh

హైదరాబాద్, జూన్ 30: బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదించడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్.. తొలు తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని వెంటనే పార్టీ అగ్రనాయకత్వానికి పార్టీలోని కీలక నేతలు తెలియజేశారు. దీంతో బీజేపీ కీలక నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్‌ రంగంలోకి దిగి.. రాజాసింగ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

కానీ రాజాసింగ్ వివరణతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలపై వారు సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి రాజసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర నాయకత్వం పంపినట్లు తెలుస్తుంది. ఇక అధ్యక్ష ఎన్నికల వేళ.. అతని నామినేషన్ అడ్డుకోవాలనుకుంటే.. నామినేషన్ పత్రాలను రాజాసింగ్‌కు తాము ఎందుకు ఇస్తామని ఈ సందర్భంగా వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రతినిధులు అధికార ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.


రాజాసింగ్ రాజీనామా.. బీజేపీ ఎమ్మెల్యే రియాక్షన్

రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతోందని తెలిపారు. అధ్యక్ష పదవికి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే నామినేషన్ వేయడానికి పార్టీ అవకాశం ఇచ్చిందని వివరించారు. ఎన్నిక ప్రక్రియలో ఏ లోపం లేకుండా దీనిని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పది మంది సభ్యులు ప్రతిపాదించిన తర్వాత నామినేషన్ వేస్తారని వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు.


బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ స్పందిస్తూ..

రాజా సింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ట చేరిందంటూ రాజాసింగ్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే.. అసెంబ్లీ స్పీకర్‌కు అందుకు సంబంధించిన లేఖను అందజేయాలని వివరించారు. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని రాణి రుద్రమ వివరించారు.


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. అందులోభాగంగా రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజా సింగ్ సైతం నామినేషన్ వేసేందుకు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనుచరులుతో వచ్చిన ఆయన్ని కార్యాలయంలోకి అనుమతించ లేదు. దీంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అధ్యక్ష పదవి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. అడ్డగించారని ఆరోపించారు. అంతేకాకుండా.. తన అనుచరులను సైతం భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు పెద్ద నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 10:16 PM