ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జైలు దుస్తుల్లో గాలి!

ABN, Publish Date - May 08 , 2025 | 04:05 AM

ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దోషిగా తేలి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి సాధారణ ఖైదీలా కారాగారంలో ఉంటున్నారు.

  • ఒకే బ్యారక్‌లో గాలి జనార్దన్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, అలీఖాన్‌ !

  • గాలితో కుటుంబసభ్యుల ములాఖత్‌

సైదాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దోషిగా తేలి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి సాధారణ ఖైదీలా కారాగారంలో ఉంటున్నారు. మిగిలిన ఖైదీల మాదిరిగానే జైలు అధికారులు ఇచ్చిన తెల్లని దుస్తులు ధరించారు. 2011లో ఇదే జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న జనార్దన్‌ రెడ్డికి కోర్టు ప్రత్యేక కేటగిరీ సదుపాయాలు కల్పించింది. కానీ, ఇప్పుడు శిక్ష పడడంతో అలాంటి సదుపాయాలు ఉండవు. జైలు నిబంధనల ప్రకారం అధికారులు ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో గాలికి కూడా అవే వర్తిస్తాయి. దీంతో నిబంధనల ప్రకారం గాలి కూడా తెల్ల దుస్తులు ధరించారు. జనార్దన్‌ రెడ్డితో పాటు ఓబుళాపురం కేసులో దోషులుగా తేలిన శ్రీనివా్‌సరెడ్డి, రాజగోపాల్‌, అలీఖాన్‌ కూడా అధికారులు ఇచ్చిన తెల్లని దుస్తులనే ధరించారు. వీరందరినీ ఒకే బ్యారక్‌లో ఉంచినట్టు సమాచారం. ఇక, జనార్దన్‌ రెడ్డిని ఆయన భార్య, కుమార్తె, సోదరుడు బుధవారం ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన భార్య, కూతురు కన్నీటి పర్యంతమయ్యారు.


మధ్యంతర బెయిల్‌ కోసం హైకోర్టుకు శ్రీనివాస్‌ రెడ్డి

ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాస్‌ రెడ్డి(గాలి బావమరిది) కుమారుడి వివాహం ఈ నెల 18న జరగనుంది. కోర్టు శిక్ష ఖరారు చేయడంతో శ్రీనివాస్‌ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:05 AM