Share News

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

ABN , Publish Date - May 06 , 2025 | 02:47 PM

10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Bank of Baroda Recruitment 2025

మీరు పదో తరగతి పాసై, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో (Bank of Baroda Recruitment) పదో తరగతి అర్హతతో 500 అసిస్టెంట్ (ప్యూన్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మే 3, 2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 23, 2025 వరకు మాత్రమే అప్లై చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే వయస్సు ఎంత ఉండాలి, నెలకు వేతనం ఎంత వస్తుందనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు

  • ఉత్తర్ ప్రదేశ్- 83

  • గుజరాత్-80

  • తెలంగాణ- 13

  • ఆంధ్రప్రదేశ్- 22

  • కర్ణాటక- 31

  • బీహార్- 23

  • జార్ఖండ్- 10

  • మధ్యప్రదేశ్- 16

  • న్యూఢిల్లీ- 10

  • ఛత్తీస్‌గఢ్- 12

  • రాజస్థాన్- 46

  • హిమాచల్ ప్రదేశ్- 03

  • హర్యానా- 11

  • పంజాబ్- 14

  • ఉత్తరాఖండ్- 10

  • తమిళనాడు- 24

  • ఒడిశా- 17

  • కేరళ- 19

  • మహారాష్ట్ర- 29

  • అస్సాం- 04

  • మణిపూర్- 01

  • నాగాలాండ్- 01

  • పశ్చిమ బెంగాల్- 14

  • జమ్మూ & కాశ్మీర్- 01

  • చండీగఢ్ (UT)- 01

  • గోవా- 03

  • దాద్రా మరియు నాగర్ హవేలి- 01

  • డామన్ & డయ్యు- 01

  • మొత్తం పోస్టులు- 500


విద్యా అర్హత & వయో పరిమితి

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ (ప్యూన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు అభ్యర్థికి స్థానిక భాషపై తగిన పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. ఇక వయోపరిమితి గురించి చెప్పాలంటే, అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 26 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఇందులో SC/ST అభ్యర్థులకు గరిష్టంగా 5 సంవత్సరాలు, OBC వర్గానికి గరిష్టంగా 3 సంవత్సరాలు వయో సడలింపు ఇస్తారు.

జీతం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ (ప్యూన్) పదవికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం నెలకు రూ.19,500 నుంచి ప్రారంభమవతుంది. ఈ క్రమంలో అనుభవం, సర్వీస్ ప్రకారం వరుసగా రూ.22160, రూ.26310, రూ.30270, రూ.33780 వరకు వేతనం పెరుగుతుంది. ఈ క్రమంలో నెలకు గరిష్టంగా రూ.37,815 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఈ పే స్కేలు బ్యాంకు కాలానుగుణంగా చేసే సవరణలకు లోబడి ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ (ప్యూన్) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష, రెండో దశ స్థానిక భాషా పరీక్ష. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, రీజనింగ్ (సైకోమెట్రిక్ టెస్ట్). 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు నాలుగు విభాగాల నుంచి వస్తాయి. అభ్యర్థులకు 80 నిమిషాల సమయం లభిస్తుంది.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము గురించి మాట్లాడితే జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 600 (పన్ను, గేట్‌వే ఛార్జీలు అదనంగా) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మాజీ సైనికుల అభ్యర్థులకు రుసుము రూ. 100 (పన్నులు, గేట్‌వే ఛార్జీలు అదనంగా)గా ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి

ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కరెంట్ ఓపెనింగ్స్ ఇన్ కెరీర్‌కి వెళ్లి, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేసి. ఆ తరువాత అభ్యర్థులు 'క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్'(https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-office-assistant-in-sub-staff-cadre-on-regular-basis) పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను పూరించడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు ఇతర వివరాలు, సంతకం, ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయాలి. చివరగా, అభ్యర్థులు కేటగిరీ ప్రకారం నిర్దేశించిన రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. దానిని ప్రింటవుట్ తీసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవాలి.


ఇవి కూడా చదవండి:

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్



Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 02:56 PM