ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AV Ranganath: ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు

ABN, Publish Date - May 15 , 2025 | 07:41 AM

ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు హైడ్రా కమిషనర్‌ ఆవుల వెంకటరంగనాథ్‌ విచ్చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్యం ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో క్షేత్రస్థాయి పర్యటించి పరిశీలించనున్నారు.

- ఫిర్యాదుల పరిష్కారానికి రంగంలోకి రంగనాథ్‌

- హయత్‌నగర్‌ సీఐపై ఆగ్రహం

హైదరాబాద్‌ సిటీ: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించడంతోపాటు ప్రభుత్వ విభాగాల రికార్డులూ పరిశీలిస్తున్నారు. కొన్ని ఫిర్యాదులకు అక్కడే పరిష్కారం చూపిన ఆయన ఇంకొన్ని ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బుధవారం పలు ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటల వరకు పర్యటించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇదో కొత్తరకం మోసం.. చానల్‌ చూస్తే రోజుకు రూ.10 వేలు


కొహెడలోని సర్వే నంబర్‌ 951, 952లోని 17 ఎకరాల విస్తీర్ణంలో 190 ప్లాట్లు ఉన్న రాజాజీనగర్‌ లే అవుట్‌ను సందర్శించారు. ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు గతంలో లే అవుట్‌లోని పార్కులు, రహదారులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేశారు. సమ్మిరెడ్డి, బాల్‌రెడ్డి తిరిగి నిర్మాణాలు చేపట్టగా ప్లాట్ల యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమ్మిరెడ్డి వారిపై దాడి చేశాడు. దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించగా, రంగనాథ్‌ స్వయంగా అక్కడకు వెళ్లారు. బాధితులు హయత్‌నగర్‌ సీఐ తీరుపై ఫిర్యాదు చేశారు.


అక్కడి ఫామ్‌హౌస్‌ యజమాని మారణాయుధాలతో దాడి చేస్తే ఓ ప్లాట్‌ యజమానికి 15 కుట్లు పడ్డాయని చెప్పారు. ఘటనపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారని రంగనాథ్‌ సీఐని ప్రశ్నించారు. సెక్షన్‌ 324 ప్రకారం కేసు నమోదు చేశామని ఆయన సమాధానమివ్వగా రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మారణాయుధాయులతో దాడి చేస్తే 324 పెడతారా అని మండిపడ్డారు. పార్కులు, రహదారులు కబ్జా చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ పేర్కొన్నారు. అనంతరం కొహెడలోని చిన్న చెరువును సందర్శించారు.


- పార్కు స్థలం కబ్జా చేస్తున్నారన్న ఫిర్యాదుపై మణికొండలోని డాలర్‌ హిల్స్‌ కాలనీకి వెళ్లిన ఆయన అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపట్టిన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీకి వెళ్లే మార్గంలో సెట్‌ బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తోన్న ఎనిమిది అంతస్తుల భవనాన్ని పరిశీలించారు.

- గుట్టల బేగంపేటలో ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని పరిశీలించి రహదారి ఆక్రమణ లేకుండా చూడాలని సూచించారు.

- కూకట్‌పల్లిలోని డైమండ్‌హిల్స్‌ లే అవుట్‌కు వెళ్లి ప్లాట్ల యజమానులతో మాట్లాడారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఫలితం లేదని, 9 ఎకరాల్లో 70 ప్లాట్లతో ఉన్న లే అవుట్‌లో పార్కులు, రోడ్ల ఆనవాళ్లు లేకుండా ఆక్రమించారని చెప్పారు. ఇరు వర్గాలను సమావేశపరిచి సంబంధిత పత్రాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.


- దుండిగల్‌ బౌరంపేటలోని సర్వే నంబర్‌ 345లో 20 ఎకరాల్లో 200 ప్లాట్లతో ఉన్న లే అవుట్‌ను పరిశీలించి రహదారులు, పార్కు స్థలాలు స్పష్టంగా గుర్తించాలని ఆదేశించారు.

- గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ క్యాంప్‌సను సందర్శించారు. క్యాంప్‌సలో కృతిమంగా కొన్నేళ్లక్రితం తవ్విన చెరువును పరిశీలించారు. పరిసరాలన్నీ రాక్‌ ఏరియాలు కావడంతో నీరు నిలవడం లేదని బ్రహ్మకుమారీలు వివరించారు. అక్కడ నిర్వహించే కార్యకలాపాలను కమిషనర్‌కు రీజనల్‌ డైరెక్టర్‌ కులదీప్‌ దీదీ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 07:41 AM