ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి

ABN, Publish Date - May 06 , 2025 | 04:59 AM

రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

  • ఆర్థిక అనుమతులు మంజూరు చేయండి

  • ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేసేందుకు సహకరించండి

  • గడ్కరీకి రేవంత్‌ విజ్ఞప్తి.. కేంద్ర మంత్రితో సీఎం భేటీ

హైదరాబాద్‌/బేగంపేట, మే 5 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ తిరుగు ప్రయాణంలో సాయంత్రం 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి లాంజ్‌లో ఆయనతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంతో పాటు దక్షిణభాగం నిర్మాణాన్ని ఏకకాలంలో పూర్తిచేసేందుకు సహకరించాలని కోరారు.


ఎన్‌హెచ్‌-765లోని హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఔటర్‌ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్‌)-ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రేడియల్‌ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను గడ్కరీకి వివరించారు. హైదరాబాద్‌-డిండి-మన్ననూర్‌, హైదరాబాద్‌-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్‌ హై వే, ఓఆర్‌ఆర్‌ నుంచి మన్నెగూడ వరకు రేడియల్‌ రోడ్ల అభివృద్ధి పనులు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:59 AM