WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - May 05 , 2025 | 02:49 PM
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. దీనిని వివిధ రాష్ట్రాల్లోని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశాయి.

న్యూఢిల్లీ, మే 05: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్దతపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతపై దాఖలైన 72 పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్, జస్టిస్ విశ్వనాథన్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఈ పిటిషన్ విచారణను మే 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఈ వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతపై ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఆ క్రమంలో తమకు వారం రోజులు గడువు కావాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణను మే 05వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. దీనిని వివిధ రాష్ట్రాల్లోని పలు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశాయి. మరోవైపు ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు సైతం చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో అయితే భారీ ఎత్తున ఘర్షణలు కూడా జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
Hyderabad Woman: మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి
For National News And Telugu News