Share News

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

ABN , Publish Date - May 05 , 2025 | 04:41 PM

TGSRTC: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సోమవారం వారు కవాతు నిర్వహించారు. అందులోభాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనున్న బస్ భవన్‌ను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సోమవారం ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్, మే 05: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సోమవారం వారు కవాతు నిర్వహించారు. అందులోభాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దనున్న బస్ భవన్‌ను తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సోమవారం ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు సమ్మె యధా విధిగా కొనసాగుతోందని ఆర్టీసీ జేఏసీ ఈ సందర్భంగా ప్రకటించింది. సమ్మె నేపథ్యంలో తమతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం పిలవకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోతాయని చెప్పారు. తమ సమ్మెకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. మే 7వ తేదీ నుంచి తాము తలపెట్టిన సమ్మె యధా విధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మికుల కవాతు నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆదివారం ఆర్టీసీ కార్మిక నేతలతో సమావేశమయ్యారు. సమ్మెను ఉప సంహరించుకోవాలని వారికి ఆయన సూచించారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడే లాభాల బాట పడుతోందని వారికి వివరించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన అనంతరం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన వివరాలను వారికి ఆయన సోదాహరణగా వివరించారు. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం తమ సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికులు సోమవారం కవాతు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ముఖ్య కార్యాలయం బస్ భవన్‌ను వారు ముట్టడించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.


మే 7వ తేదీ నుంచి తాము సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఏప్రిల్ 27వ తేదీన అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్టీసీ జేఏసీ విడుదల చేసింది. మేడే స్ఫూర్తితో తాము ఈ సమ్మెకు సిద్దమయ్యామంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి ఆర్టీసీ జేఏసీ తీసుకు వెళ్లింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Updated Date - May 05 , 2025 | 05:38 PM