Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - May 05 , 2025 | 03:36 PM
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీతో దేశంలో అత్యున్నత స్థాయి అధికారులు వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ, మే 05: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో.. అంతకు రోజు..అంటే శనివారం నావల్ చీఫ్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠితో ప్రధాని మోదీ వరుసగా సమావేశమయ్యారు. గత వారం ప్రధానితో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర దివ్వేది భేటీ అయ్యారు. ఇలా వరుసగా త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ కావడం.. తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సైతం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో గత మంగళవారం ఉన్నత స్థాయి అధికారులతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదీకాక పాక్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. గతంలో పాక్‌తో చేసుకున్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్ గగన తలంలో పాక్ విమానాల రాకపోకలను సైతం నిషేధించింది. అదే విధంగా పాకిస్థాన్‌తో ప్రత్యక్ష, పరోక్ష ఎగుమతులు, దిగుమతులను సైతం భారత్ నిషేధించింది. పాకిస్థాన్‌ను పూర్తిగా అష్టదిగ్బందం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. వాటన్నింటిని చేసేందుకు భారత్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు కీలక సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచ దేశాల ముందు ఉంచింది. దీంతో భారత్‌కు ప్రపంచదేశాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
Hyderabad Woman: మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
For National News And Telugu News