Bharat Gaurav Tourist Train: సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర
ABN, Publish Date - Jul 30 , 2025 | 10:10 AM
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
హైదరాబాద్: ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర రైలు చెన్నూ నుంచి బయలుదేరి ఏపీలోని గూడూరు, నెల్లూరు(Gudur, Nellore), ఒంగోలు, చీరాల, గుంటూరు, తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ,
హైదరాబాద్(Miryalaguda, Nalgonda, Hyderabad), కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని, ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కవచ్చని తెలిపారు. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్దాపూర్, మథుర, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసీ, గయా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని ఆయన తెలిపారు. 9355021516 ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి టికెట్లు కొనవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్, మేనేజర్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News
Updated Date - Jul 30 , 2025 | 10:10 AM