ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బిహార్‌ ఎన్నికల్లో మహా కూటమితో కలిసి మజ్లిస్‌ పోటీ..

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:31 PM

బీజేపీ, ఎన్‌డీఏ కూటమిని ఓడించేందుకు బిహార్‌ అసెంబ్లీకి ఈఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి మహా కూటమి(మహా ఘట్బంధన్‌) నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

- మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

హైదరాబాద్‌: బీజేపీ, ఎన్‌డీఏ కూటమిని ఓడించేందుకు బిహార్‌ అసెంబ్లీకి ఈఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి మహా కూటమి(మహా ఘట్బంధన్‌) నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) తెలిపారు. ఈసారిఎన్నికల్లో ఎన్‌డీఏను గద్దె దించే లక్ష్యంతో బిహార్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్‌ ఇమామ్‌ప్రణాళిక రూ పొందిస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ, ఎన్‌డీఏలను నియంత్రించేందుకు ఆర్‌జేడీ, కాంగ్రెస్ పార్టీతో కూడిన మహాకూటమితో కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు. క్రియాశీల కార్యకర్తల బలం ఉన్న సీమాంచల్‌లో మజ్లిస్‌ పోటీ చేస్తోందని తెలిపారు. మహా కూటమి పార్టీలు ఎన్నికల్లో తమతో కలిసిరాని పక్షంలో బిహార్‌లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని ఒవైసీ స్పష్టం చేశారు.

ఐదేళ్ల క్రితం బీజేపీ ఎన్‌డీఏను నియంత్రించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించామని గుర్తు చేశారు. బిహార్‌ ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ పేరిట ఓటర్ల జాబితా సవరణ తీరుపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. సీమాంచల్‌ లాంటి ప్రాంతాల్లో వరద ముంపుతో అక్కడి నిరుపేదల కుటుంబాలు సర్వస్వం కోల్పోయి వలస వెళ్తారన్నారు. ఓట ర్ల జాబితా సవరణ పేరిట బర్త్‌ సర్టిఫికెట్‌, నివాస ధృవీకరణతో పాటు తలిదండ్రుల నివాస ధృవీకరణ పత్రాలు చూపాలంటే నిరుపేదలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో వేలాది మంది నిరుపేదల పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చక పోవచ్చని, నిరుపేదలు ఓటుహక్కు పొందలేరని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 30 , 2025 | 12:31 PM