Virat Kohli: కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్.. కింగ్‌కు ఇన్ని తక్కువ మార్కులా..
ABN, Publish Date - May 17 , 2025 | 11:11 AM
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్క్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రెండు సబ్జెక్టుల్లో కింగ్‌కు మార్కులు మరీ తక్కువగా వచ్చాయి. మరి.. ఏంటా సబ్జెక్ట్‌లు అనేది ఇప్పుడు చూద్దాం..
టెస్టులకు రిటైర్‌మెంట్ ఇచ్చేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. భారత్-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్తతల వల్ల మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్-2025 రీస్టార్ట్ అవుతోంది. దీంతో మిగిలిన మ్యాచుల్లో అదరగొట్టాలని అనుకుంటున్నాడు. ఆర్సీబీ తొలి కప్పు కలను ఈసారి తప్పకుండా నిజం చేయాలని కింగ్ పట్టుదలతో ఉన్నాడు. రిటైర్‌మెంట్ ప్రకటన తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతుండటంతో విరాట్ మీదే అందరి చూపు నెలకొంది. ఈ తరుణంలో ఈ టాప్ బ్యాటర్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే 10వ తరగతి మార్క్ షీట్. మరి.. టెన్త్ క్లాస్‌లో విరాట్‌కు ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..
సీరియస్‌గా తీసుకుంటే..
కోహ్లీ 2004వ సంవత్సరంలో పదో తరగతిని పూర్తి చేసుకున్నాడు. అయితే బ్యాట్ పట్టి క్రీజులోకి దిగితే పరుగుల వర్షం కురిపించే విరాట్.. పరీక్షల్లో మాత్రం ఆ స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఆంగ్లం (ఏ1 గ్రేడ్), సాంఘిక శాస్త్రం (ఏ2), హిందీ (బీ1)లో అతడికి మంచి గ్రేడ్స్ వచ్చాయి. కానీ సామాన్య శాస్త్రంతో పాటు గణితంలో తక్కువ గ్రేడ్స్ వచ్చాయి. మ్యాథ్స్ (సీ2), సైన్స్ అండ్ టెక్నాలజీ (సీ1)లో తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు విరాట్. ఈ 2 సబ్జెక్టుల్లో అతడికి థియరీలో 51, 32 చొప్పున మార్కులు వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ మార్క్‌షీట్‌పై నెటిజన్స్ స్పందిస్తున్నారు. క్రికెట్ మీద దృష్టి పెట్టడం వల్ల చదువులో అతడు రాణించలేదని అంటున్నారు. మార్కులు గొప్పగా రాకపోయినా కెరీర్‌లో అతడు ఈ స్థాయికి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు. క్రికెట్ కాకుండా చదువును అతడు సీరియస్‌గా తీసుకుంటే మరోలా ఉండేదని.. సక్సెస్‌కు మార్కులు కొలమానం కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సవాల్‌కు సిద్ధం
ఐపీఎల్-2025 అర్ధాంతరంగా ఆగిపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకున్నాడు కోహ్లీ. టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో కెరీర్ పరంగా ఉన్న ఒత్తిడి చాలా మటుకు తగ్గింది. దీంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచుల్లో అతడు కూల్‌గా బ్యాటింగ్ చేసేందుకు, ఆటను పూర్తిగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుంది. అయితే ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తున్న ఆర్సీబీ.. తొలి కప్పును పట్టేయాలని చూస్తోంది. కాబట్టి టీమ్‌లో సీనియర్ అయిన విరాట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో 505 పరుగులతో జోరు మీదున్న కింగ్ గానీ రాణిస్తే బెంగళూరు కప్పు అందుకోకుండా ఆపడం ఏ జట్టు వల్లా కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఆర్సీబీ మోసం చేసింది: పాటిదార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 17 , 2025 | 11:11 AM