Share News

Virat Kohli IPL 2025: కోహ్లీపైనే కళ్లన్నీ

ABN , Publish Date - May 17 , 2025 | 02:09 AM

ఐపీఎల్‌ పునఃప్రారంభం సందర్భంగా బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్‌ మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. విరాట్‌ కోహ్లీ ప్రదర్శనపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది.

Virat Kohli IPL 2025: కోహ్లీపైనే కళ్లన్నీ
Virat Kohli

  • నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ ఢీ

  • జూఐపీఎల్‌ పున:ప్రారంభం నేడు

బెంగళూరు: ఇండో-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారం రోజుల క్రితం అర్ధంతరంగా నిలిచిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పున:ప్రారంభానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి మళ్లీ లీగ్‌ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇక్కడి చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా, ఈ పోరులో అందరి దృష్టీ విరాట్‌ కోహ్లీపైనే ఉండనుంది. ఐపీఎల్‌ విరామం సమయంలో అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన కోహ్లీ.. ఈ సీజన్‌ లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ తరుణంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో విరాట్‌ మరోసారి అదరగొట్టే అవకాశముంది. రజత్‌ పటీదార్‌ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు లీగ్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడి 16 పాయింట్లతో ప్లేఆ్‌ఫ్సకు అడుగుదూరంలో ఉంది. కోల్‌కతాపై నెగ్గి నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఆర్సీబీ ఉంది. మరోవైపు 12 మ్యాచ్‌లాడి 11 పాయింట్లతో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌, రహానే కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరుజట్ల మధ్య జరిగే ఈ రసవత్తర పోరు అభిమానులను అలరించడం ఖాయం.

Updated Date - May 17 , 2025 | 07:58 AM