Tim David Swims: టిమ్..స్టేడియంలో స్విమ్
ABN , Publish Date - May 17 , 2025 | 02:01 AM
బెంగళూరులో వర్షం కారణంగా స్టేడియం పూర్తిగా తడిసి ముద్దైంది. ఆర్‌సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ వర్షపు నీటిలో ఈత ఆడి ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
బెంగళూరు: మండే ఎండల్లో వరుణుడు దంచి కొడుతుంటే..ఆ జోరు వానలో తడుస్తుంటే..వావ్..ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ కూడా అలాంటి వాతావరణంలో ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఐపీఎల్ పునఃప్రారంభంలో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు తలపడనుంది. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షంతో స్టేడియం తడిసి ముద్దయ్యింది. డేవిడ్ జోరు వానలో తడుస్తూ..మైదానంపై కప్పిన కవర్లపై చేరిన వర్షపు నీటిలో ఈదుతూ ఎంజాయ్ చేశాడు.