ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: కోహ్లీకి నో ఆప్షన్.. ఫ్యాన్స్ కోసమైనా ఒప్పుకోవాలి

ABN, Publish Date - May 11 , 2025 | 11:02 AM

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి డిస్కషన్స్ మరింత ఊపందుకున్నాయి. లాంగ్ ఫార్మాట్‌కు విరాట్ గుడ్‌‌బై చెబుతాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Virat Kohli

ఏ క్రికెటరైనా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవ్వాల్సిందే. ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడటం, టీమ్‌లో ప్లేస్ కోసం పోటీ పెరగడం లాంటి రీజన్స్‌తో చాలా మంది ప్లేయర్లు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తారు. అయితే కొందరి రిటైర్మెంట్‌ను మాత్రం అభిమానులు అస్సలు అంగీకరించరు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. టెస్టుల నుంచి కింగ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడనే రూమర్స్ రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. అయితే ఫ్యాన్స్ కోసమైనా అతడీ నిర్ణయంపై పునరాలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


అప్పటిదాకా ఆడాల్సిందే..

రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ నడవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న కింగ్.. టెస్టులకూ వీడ్కోలు చెప్పేసి వన్డేల్లో మాత్రమే కంటిన్యూ అవ్వాలని భావిస్తున్నాడట. రిటైర్మెంట్‌కు ఇదే కరెర్ట్ టైమ్ అని అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని బీసీసీఐకి క్లియర్‌గా చెప్పేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అతడి నిర్ణయానికి నో చెప్పిన బోర్డు పెద్దలు.. మరికొన్నాళ్లు టెస్ట్ టీమ్‌లో కొనసాగాలని రిక్వెస్ట్ చేశారని సమాచారం. కనీసం ఇంగ్లండ్ టూర్ వరకైనా కంటిన్యూ అవ్వాలని కోరారట. దీనిపై కోహ్లీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా కింగ్‌పై ప్రెజర్ అంతకంతా పెరుగుతోంది. రిటైర్మెంట్‌ ఆలోచనలు మానుకోవాలని అభిమానుల నుంచి నెట్టింట భారీగా డిమాండ్స్ వస్తున్నాయి.


మాజీల రిక్వెస్ట్

కోహ్లీ ఇప్పుడు ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు. గాయం బాధలు లేవు. వర్క్‌లోడ్ ప్రెజర్ కూడా లేదు. కాబట్టి టెస్టుల్లో ఇంకొన్నాళ్లు కంటిన్యూ అవ్వాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు టీమిండియాకే కాదు.. టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ అవసరం ఎంతో ఉందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా లాంటి పలువురు మాజీలు అంటున్నారు. విరాట్ రిటైర్మెంట్ ఆలోచనలు మానుకో.. నీలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉందని మాజీలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్లు, బీసీసీఐ కోసం కాదు గానీ.. తన కెరీర్ అంతా అండగా ఉంటూ, వైఫల్యాల్లోనూ ఆసరాగా ఉన్న అభిమానుల కోసమైనా విరాట్ వెనక్కి తగ్గాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ విషయంలో కోహ్లీ ఏం చేస్తాడో త్వరలో తేలిపోనుంది.


ఇవీ చదవండి:

పాక్ గాలి తీసిన చాహల్

మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌

టెస్ట్‌ జట్టు సారథిగా గిల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 11:10 AM