ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 Franchisees: ఫ్రాంచైజీలకు బీసీసీఐ హుకుం.. ఆ రోజే కచ్చితంగా..

ABN, Publish Date - May 11 , 2025 | 03:06 PM

BCCI: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హుకుం జారీ చేసింది బీసీసీఐ. కచ్చితంగా నిర్ణీత తేదీ లోపు ఆ పని చేయాల్సిందేనని ఆదేశించింది. మరి.. బోర్డు జారీ చేసిన ఆ హుకుం ఏంటో ఇప్పుడు చూద్దాం..

IPL 2025

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో ఐపీఎల్‌‌ను రీస్టార్ట్ చేయడంపై ఫోకస్ చేస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఇండో-పాక్ వార్ వల్ల క్యాష్ రిచ్ లీగ్‌ను తొలుత నిరవధికంగా వాయిదా వేసిన బోర్డు.. ఆ తర్వాత ఆ గ్యాప్‌ను వారానికి తగ్గించింది. ఇప్పుడు ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకోవడంతో ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచుల్ని నిర్వహించడంపై దృష్టి సారిస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగానే అన్ని ఫ్రాంచైజీలకు హుకుం జారీ చేసిందట. మరి.. 10 జట్లకు బోర్డు జారీ చేసిన హుకుం ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..


రప్పించాల్సిందే..

ఐపీఎల్-2025ని రీస్టార్ట్‌ చేయాలని చూస్తున్న బీసీసీఐ.. ఫారిన్ ప్లేయర్లతో సంప్రదింపులు జరపాలని ఫ్రాంచైజీలను ఆదేశించిందట. ఓవర్సీస్ ఆటగాళ్లను తిరిగి తీసుకురావడంపై ఫోకస్ చేయాలని సూచించిందట. విదేశీ ప్లేయర్లు రాకపోతే ఐపీఎల్ కళ తగ్గే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లను తిరిగి తీసుకురావడంపై సీరియస్‌గా ఉందట బోర్డు. ఫారిన్ ప్లేయర్లను మే 13లోగా రప్పించాలని ఫ్రాంచైజీలకు ఆదేశించిందట. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్లు తమ హోమ్ వెన్యూస్‌లో మంగళవారం నాడు కచ్చితంగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసిందట. పంజాబ్ కింగ్స్ ఎక్కడ ఆడాలనేది మాత్రం బీసీసీఐ డిసైడ్ చేయనుందని తెలుస్తోంది. వరుసగా డబుల్ హెడర్స్ నిర్వహిస్తూ టోర్నీని తర్వగా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట బోర్డు పెద్దలు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతున్నారట. సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే టోర్నమెంట్ వెంటనే స్టార్ట్ అవ్వొచ్చు.


ఇవీ చదవండి:

ఐపీఎల్ చైర్మన్ క్లారిటీ.. నో టెన్షన్

బీసీసీఐకి కొత్త తలనొప్పి

కోహ్లీకి నో ఆప్షన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 03:10 PM