Share News

Arun Dhumal IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ.. ఇక నో టెన్షన్

ABN , Publish Date - May 11 , 2025 | 02:38 PM

BCCI: అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 మళ్లీ రీస్టార్ట్ ఎప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్-పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌కు ఒప్పుకోవడంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ క్రమంగా క్యాష్ రిచ్ లీగ్ వైపు మళ్లుతోంది. ఈ టైమ్‌లో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు.

Arun Dhumal IPL 2025: ఐపీఎల్ రీస్టార్ట్.. అరుణ్ ధుమాల్ క్లారిటీ.. ఇక నో టెన్షన్
IPL 2025

ఇండో-పాక్ సీజ్‌ఫైర్‌కు అంగీకరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. కాల్పుల విరమణ వల్ల పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్ రిచ్ లీగ్‌ను రీస్టార్ట్ చేయడంపై దృష్టిసారించింది భారత క్రికెట్ బోర్డు. అయితే భారత్-పాక్ ఉద్రిక్తతల వల్ల చాలా మంది ఓవర్సీస్ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ స్వదేశానికి వెళ్లారు. దీంతో టోర్నమెంట్ రీస్టార్ట్ అయితే వాళ్లు తిరిగొస్తారా.. లేదా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయనేం అన్నారంటే..


తప్పకుండా వస్తారు..

ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభమైతే ఫారిన్ ప్లేయర్లు కచ్చితంగా భారత్‌కు వస్తారని అరుణ్ ధుమాల్ చెప్పారు. ఓవర్సీస్ ఆటగాళ్లు తిరిగొచ్చి టోర్నీలోని మిగిలిన మ్యాచుల్లో ఆడతారనే నమ్మకం తనకు ఉందన్నారు. క్యాష్ రిచ్ లీగ్ వారం పాటు వాయిదా పడినందున అంతా తమ ఫ్యామిలీస్ దగ్గరకు వెళ్లాలని కోరుకున్నారని ధుమాల్ చెప్పుకొచ్చారు. సిచ్యువేషన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నామని, దీనికి అనుగుణంగా ఫ్రాంచైజీల ఓనర్స్, వాటాదారులకు సమాచారం ఇస్తామని వివరించారు. ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచుల్ని నిర్వహించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉన్నామని చెప్పడం మీదా ఐపీఎల్ చైర్మన్ రియాక్ట్ అయ్యారు. ఈ న్యూస్ తన దాకా వచ్చిందన్నారు. క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించడానికి రెడీగా ఉన్నామని ఈసీబీ చెప్పడం సంతోషించాల్సిన విషయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటిదాకా తాము ఎవరితోనూ డిస్కషన్స్ చేయలేదన్నారు.


ఇవీ చదవండి:

బీసీసీఐకి కొత్త తలనొప్పి

కోహ్లీకి నో ఆప్షన్

పాక్ గాలి తీసిన చాహల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 03:07 PM